FbTelugu

పోతిరెడ్డిపాడుపై రాజ‌కీయ ర‌గ‌డ‌!

శ్రీశైలం ప్రాజెక్టు సాక్షిగా తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ర‌చ్చ మొద‌లైంది. పోతిరెడ్డిపాడు ద్వారా రాయ‌ల‌సీమ‌కు నీరందించాల‌నే ల‌క్ష్యంతో ఏపీ స‌ర్కారు 203 జీవో జారీచేసింది.

దీని ద్వారా 10 టీఎంసీల కృష్ణాజ‌లాల‌ను త‌ర‌లించేందుకు ప‌రిపాల‌న అనుమ‌తులు ఇచ్చింది. ఇది రాజ‌కీయంగా పెనుదుమారానికి కార‌ణ‌మైంది. పోతిరెడ్డిపాడు సామ‌ర్ధ్యం పెంచితే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌నేది తెలంగాణ నేత‌ల ఆందోళ‌న. ప్ర‌స్తుతం పోతిరెడ్డిపాడు ద్వారా విద్యుత్ ఉత్ప‌త్తితో క‌ల‌సి 64-65 వేల క్యూసెక్కుల పై హ‌క్కుంది. మ‌రో 20 వేల క్యూసెక్కులు పెంచితే శ్రీశైలం ద్వారా భారీగా నీరు ఏపీ మ‌ళ్లించుకుంటుంద‌నేది తెలంగాణ ప్ర‌భుత్వం మాట‌.

తెలంగాణ‌లో 120 టీఎంసీల‌తో క‌ల్వ‌కు్తి, రంగారెడ్డి, పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు దీనిద్వారా న‌ష్ట‌పోతాయ‌ని ఆరోపిస్తూ కృష్ణ్యా ట్రిబ్యున‌ల్‌కు తెలంగాణ స‌ర్కారు ఫిర్యాదు చేసింది. రాయ‌ల‌సీమ‌కు తాగు, సాగునీటికి అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెట‌రీ ద్వారా శ్రీశైలం కుడిగ‌ట్టుకాలువ‌, తెలుగంగ‌, గాలేరి-న‌గ‌రి సుజ‌ల స్ర‌వంతికి నీటిని విడుద‌ల చేస్తారు. దీనికోసం 80 వేల క్యూసెక్కుల సామ‌ర్థ్యం పెంచాల‌నేది అస‌లు ల‌క్ష్యం. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంగా పేరు పెట్టిన దీనికి ఏకంగా రూ. 3,890 కోట్లు ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా కూడా వేశారు.

అస‌లు క‌థ‌లోకి వెళితే 1977 అక్టోబ‌రు 28న కృష్ణాన‌ది ప‌రివాహ‌క ఏపీ, మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క రాష్ట్రాల మ‌ధ్య ఒప్పందం చేసుకున్నారు. అయితే ఒక్కో రాష్ట్రం నుంచి టీఎంసీల నుంచి త‌మిళ‌నాడుకు తాగునీరు ఇవ్వాల‌నే నిబంద‌న ఉంది. తొలిసార 1988లో శ్రీశైలం జ‌లాశ‌య విస్త‌ర‌ణ‌లో పోతిరెడ్డిగ్రామం వ‌ద్ద ప్ర‌ధాన రెగ్యులేట‌ర్ నిర్మించారు. ప్ర‌స్తుతం ఏపీ మాత్రం త‌మ‌కు రావాల్సిన 512 టీఎంసీల వాటా ఉంద‌ని వాదిస్తుంది. ఎవ‌రి అనుమ‌తితో ప‌నిలేద‌ని వాదిస్తుంది. తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యం పెంచ‌టం వ‌ల్ల త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తాగునీరు అంద‌దంటూ ఆందోళ‌న వ్య‌క్తంచేస్తోంది. క‌ల్వ‌కుర్తి, ఎస్ ఎల్‌బీసీ, పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల‌కు నీటి కొర‌త వాటిల్లుతుంద‌ని చెబుతుంది. బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ఉమ్మ‌డి రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకు 512 టీఎంసీలు, తెలంగాణ‌కు 299 టీఎంసీలు ద‌క్కాల్సి ఉంది. ప్ర‌స్తుతం వాటాలపై ట్రిబ్యున‌ల్‌లో వాద‌న‌లు జరుగుతున్నాయి. జ‌డ్జిమెంట్ పెండింగ్‌లో ఉండ‌గానే ఏపీ జీవో జారీచేయ‌టం స‌మ‌స్య‌కు కార‌ణ‌మైంది. ఏపీ, తెలంగాణ సీఎంల మ‌ధ్య ఉన్న స‌ఖ్య‌త నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల స‌మ‌స్య తీరుతుంద‌నే భావ‌న ఇరు వైపుల ఉంది.

You might also like