FbTelugu

రామతీర్థం చుట్టే రాజకీయాలు

* పోలీసుల ఆదీనంలో రామతీర్థం
విజయనగరం: గత రెండ్రోజులుగా ఏపీలో రాజకీయాలు మొత్తం రామతీర్థం చుట్టే తిరుగుతున్నాయి. రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేయడం పట్ల జాతీయ పార్టీలు తీవ్రంగా పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున పోలీసులు రామతీర్థాన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇవాళ ఉదయం రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి తదితరులు రామతీర్థాన్ని సందర్శించనున్నారు. ఈ తరుణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారుపై టీడీపీ, బీజేపీ శ్రేణులు దాడులకు దిగిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.