FbTelugu

సీఎం ఆరోగ్యంపై రాజకీయ జిమ్మిక్కులా? : హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇవాళ ఆ పిటిషన్ పై హైకోర్టులో విచారణకు రాగా.. పిటిషనర్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ పిటిషన్ ను విచారించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. ఈ సందర్భంగా సీఎం ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నామని న్యాయస్థానం తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.