FbTelugu

కానిస్టేబుల్ కోడలిపై పోలీసు మామ అత్యాచారం

లక్నో: ఆ కుటుంబంలో ముగ్గురూ పోలీసులే. కాని మామ కోడలిపై కన్నేసి అత్యాచారం చేశాడు. ఆ విషయాన్ని భర్తకు చెబితే కేసు పెట్టకుండా, త్రిఫుల్ తలాక్ ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
మీరట్ పోలీసు స్టేషన్ లో భార్య కానిస్టేబుల్ కాగా, పోలీసు విభాగంలో ఆమె భర్త అధికారిగా పనిచేస్తున్నాడు. ఆమె మామ నజీర్ అహ్మద్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ లో పనిచేస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ నజీర్ అహ్మద్ కోడలిని లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఈ విషయం భర్తకు చెబితే చంపేస్తానని హెచ్చరించాడు.

తనను మామ అత్యాచారం చేశాడని భర్త అబీద్ కు చెబితే కేసు పెట్టకుండా త్రిఫుల్ తలాక్ ఇచ్చాడని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారం చేసిన మామ నజీర్ అహ్మద్ తో పాటు, భర్త అబీద్ పైన స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం అబీద్ ను వివాహం చేసుకున్నానని, కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది. మీరట్ సిటీ ఎస్.పి వినీత్ భట్నాగర్ మాట్లాడుతూ, నజీర్ తో పాటు ఆయన కుమారుడు అబీద్ పై కేసు నమోదు అయ్యిందన్నారు. అబీద్ కొత్వాలి పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్నాడన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.