FbTelugu

లాక్ డౌన్ బెట్టింగ్ పై పోలీసులు నిఘా

న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత ఏ క్షణంలో నైనా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రతి రోజు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

కరోనా పాజిటివ్ కేసులను సైతం బుకీలు క్యాష్ చేసుకుంటున్నారు. దేశంలో లాక్ డౌన్ వార్తలు పై భారీగా బెట్టింగ్ లు పెడుతున్నారు. మే నెల 2 తేదీ నుండి లాక్ డౌన్ ఉంటుందంటూ బుకీలు బెట్టింగ్ చేస్తున్నారు. రెండు వారాలు లేదా ఒక నెల పాటు లాక్ డౌన్ ఉంటుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ లాగే, లాక్ డౌన్ పై కూడా యువత బెట్టింగ్ పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా సమాచరం తెలుసుకున్న పోలీసులు బెట్టింగ్ ముఠాలపై ఓ కన్నేశారు. ఏ మాత్రం ఆధారం దొరికినా పట్టుకుని కేసులు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ మే 2వ తేదీన నిర్వహిస్తున్నారు. ఫలితాలు వెల్లడి కాగానే అదే రోజు రాత్రి నుంచి లాక్ డౌన్ విధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.