FbTelugu

పోలీసులు… మీడియాను గౌరవించాలి: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో మీడియాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, మన కోసం మీడియా పనిచేస్తుందనే విషయం పోలీసులు గుర్తు పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.

వార్తల కోసం వెళ్లే మీడియా ను ఆపకండి… ఈ సమయంలో వార్తలు చాలా ముఖ్యం అని అన్నారు. గత రెండు రోజులుగా మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తనకు సమాచారం అందిందని అన్నారు.

ప్రగతి భవన్ లో ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం పై విషయాన్ని ప్రస్తావించారు. పోలీసుల వ్యవహార శైలి, దురుసుతనంపై జర్నలిస్టులు అపార్థం చేసుకోవద్దన్నారు.

జర్నలిస్టుల పట్ల దురుసుగా ఉండవద్దని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇకనుంచి పోలీసులు మీడియా ప్రతినిధుల మీద దురుసుగా ప్రవర్తించరు అని సీఎం అన్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More