FbTelugu

వాహనాలు జప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్: సెకండ్ వేవ్ లాక్ డౌన్ లో పోలీసులు కాస్త మెతకగా ఉండడంతో పలువురు అవసరం లేనప్పటికీ రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. అవసరం లేకున్నా తిరుగుతున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని డిజిపి ఎం.మహేందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు షాపింగ్ చేసుకునేందుకు అనుమతించగా జనాలు 8 నుంచి 10 గంటల మధ్య పోటెత్తుతున్నారు. భౌతిక దూరం పాటించడం లేదని, షాపులు జనంతో నిండిపోతున్నాయని నివేదికలు అందాయి. కొందరు అనవసరంగా తిరుగుతున్నారని కూడా స్సష్టం కావడంతో కఠినంగా వ్యవహరించాలని మహేందర్ రెడ్డి బుధవారం నాడు పోలీసులను ఆదేశించారు. అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్నవారి వాహనాలు జప్తు చేయాలని స్పష్టం చేయడంతో గురువారం ఉదయం 10 గంటల నుంచి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పత్రాలు ఉన్నవారిని వదిలేస్తూ మిగతా వారి వాహనాలను జప్తు చేసి కేసులు పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.