FbTelugu

కరణ్ కాన్సెప్ట్ ఆఫీసులో పోలీసుల సోదాలు

హైదరాబాద్: ప్రేమించి మోసం చేసిన కరణ్ కన్సెప్ట్ అధినేత, హైదరాబాద్ టీటీడీ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్ చెరుకు కరణ్ రెడ్డి కి చెందిన బాంజారాహిల్స్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు.

ప్రేమ పేరుతో మ్యూజిక్ టీచర్ ను మోసం చేసిన కరణ్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ బంజారాహిల్స్ లోని ఆయన కార్యాలయంలో హార్డ్ డిస్క్ లు, సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం గతేడాది ఏప్రిల్ నెలలో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తున్న యువతికి చెరుకు కరణ్ రెడ్డి ఫ్రెండ్ రిక్వెస్టు పంపాడు. దాన్ని ఆమె అంగీకరించడం, ఇద్దరు ఛాట్ చేసుకోవడం మొదలైంది. సాన్నిహిత్యం పెరగడంతో అతనికి తన కుటుంబం వివరాలు, ఆర్థిక స్థితిగతులను తెలియచేసేది.

పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన కార్యాలయానికి పిలిపించుకుని లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది రోజుల తరువాత ఆమె సోషల్ మీడియా కనెక్షన్లను కట్ చేశాడు. కరణ్ భార్య మానస రంగ ప్రవేశం చేసి బెదిరించడంతో మ్యూజిక్ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధరువు న్యూస్ వెబ్ సైట్ తో పాటు మరికొన్ని న్యూస్ వెబ్ సైట్లను, యూ ట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తున్నాడని పోలీసులకు వివరించింది. టీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏర్పాట్లు కూడా చేస్తాడని తెలియచేయడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.