FbTelugu

ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసుల ఝలక్

హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ పోలీసులు ఝలక్ ఇచ్చారు. బుల్లెట్ ఫ్రూప్ వాహనానికి ప్రతి కిలోమీటర్ కు రూ.37 చెల్లించాలని, డ్రైవర్ కు ప్రతి రోజు రూ.100 చెల్లించాలని నోటీసులు పంపించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్యటించేందుకు తెలంగాణ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ కు బుల్లెట్ ఫ్రూప్ వాహనం కేటాయించారు. ఇంటెలీజెన్స్ విభాగం సిఫారసు మేరకు వాహనం (స్కార్పియో ఏపీ9పీఏ 416) సమకూర్చినట్లు తెలిపారు.

ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగిన ప్రతి కిలోమీటర్ కు రూ.37 చొప్పున చెల్లించాలని, డ్రైవర్ కు ప్రతి రోజు రూ.100 చొప్పున ప్రభుత్వం పేర్కొన్న ఖాతాలో జమ చేయాలని నోటీసులో స్పష్టం చేశారు. వాహనం ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలు ప్రతిరోజు డైరీలో నమోదు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.