FbTelugu

ముస్లిం-హిందూ పెళ్లిని అడ్డుకున్న పోలీసులు

లక్నో: నగరంలో ఒక హిందూ యువతి, ముస్లిం యువకుడితో జరిగే వివాహాన్ని పోలీసులుకు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లి, లక్నో జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతాంతర వివాహాలను, ముఖ్యంగా హిందూ-ముస్లిం పెళ్లిళ్లను నిలువరించేందుకు బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. లవ్ జిహాదిపై బీజేపీ గత రెండు దశాబ్ధాలుగా ఉద్యమిస్తున్న నేపథ్యంలో యూపీలో అధికారంలోకి రాగానే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ బిల్లును తెచ్చారు. ఈ బిల్లు ప్రకారం మతాంతర వివాహం చేసుకోవాలని అనుకునే వారు జిల్లా మెజిస్ట్రేట్ నుంచి రెండు నెలల ముందే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం మతం మారడం లేదని అఫిడవిట్ దాఖలు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకోవాలని అందులో పేర్కొన్నారు.

హిందూ యువతిని ముస్లిం యువకుడు పెళ్లి చేసుకుంటున్నాడని సమాచారం అందడంతో వెంటనే వేదిక వద్దకు చేరి నిలిపివేశామన్నారు. పోలీసు స్టేషన్ కు వధూవరులతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించి చట్ట విరుద్ద మతమార్పిడి ఆర్డినెన్స్ కాపీ అందచేశామన్నారు. లక్నో జిల్లా మెజిస్ట్రేట్ నుంచి అనుమతి పొందాలని వారికి సూచించినట్లు పోలీసు అధికారి సురేష్ చంద్ర రావత్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.