FbTelugu

పవన్ సభకు పోలీసుల అనుమతి

గుంటూరు: తూర్పు గోదావరి జిల్లాలో దివిస్ లాబొరేటరీస్ ప్రాంతంలో పర్యటించేందుకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయిమ్ అనుమతించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కొత్త పాకలలో కాలుష్యంతో ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచేందుకు జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారన్నారు. కొత్త పాకల గ్రామంలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తనకు ఫోన్ చేసి అనుమతిస్తున్నట్లు తెలియజేశారని మనోహర్ వెల్లడించారు.

శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్లు ప్రకటించారు దీనిపై పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ శనివారం ఉదయం రాజమండ్రి చేరుకుంటానని తెలిపారు. కొత్త పాకలలో కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించారు. అనుమతి నిరాకరణపై తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తమ అసంతృప్తిని తెలియజేశారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.