FbTelugu

పోలీసు వాహనాన్ని ఢీకొన్న మరోకారు

police-patroling-car-accident-in-jubilihills

హైదరాబాద్ : పోలీసు వాహనాన్ని మరో కారు ఢీకొన్న ఘటన నగరంలో తెల్లవారు జామున జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 2లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు తమ పెట్రో వెహికల్ ను ఓ రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచగా.. వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. దీంతో పోలీస్ పెట్రో వెహికల్ తుక్కుతుక్కైంది. ఈ ఘటనలో హోం గార్డ్ రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like