FbTelugu

కరోనాను జయించి… విధుల్లోకి పోలీసులు

హైదరాబాద్: రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ సోకుతున్న విషయం తెలిసిందే.

నగరంలో పనిచేస్తున్న పోలీసులు, పోలీసు అకాడెమీలో శిక్షణ పొందుతున్న పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న చాలా మంది పోలీసులకు కరోనా సోకింది. వారిలో కొందరు కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరారు. బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్ లో 26 మంది పోలీసులు కరోనా బారిన పడగా వారిలో 15 మంది రికవరీ అయ్యారు. కరోనాను జయించి విధుల్లో చేరిన వారిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సాదరంగా ఆహ్వానించారు.

You might also like