FbTelugu

కార్వి కన్సల్టెన్సీ కి పోలీసుల నోటీసులు

హైదరాబాద్: దేశంలో ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ గా గుర్తింపు పొందిన కార్వి కి కష్టాలు మొదలయ్యాయి. భారీ ఎత్తున రుణాల ఎగవేత కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పులపై వాయిదాలు చెల్లించడం లేదంటూ ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకులు వేర్వేరుగా సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రెండు బ్యాంకుల నుంచి కార్వి స్టాక్ బ్రోకింగ్ కన్సల్టెన్సి రూ.460 కోట్లు రుణం తీసుకున్నది. ఫిర్యాదును పరిశీలించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు. గత రెండు సంవత్సరాలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో బకాయిలు పెరుకుపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు కు రూ.137 కోట్లు, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు కు రూ.329 కోట్లు బకాయి పడింది. స్టాక్ బ్రోకింగ్ లో అక్రమాలకు పాల్పడుతున్నదంటూ ఫిర్యాదు రావడంతతో సెబి (స్టాక్ ఎక్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా) 2019 లో విచారణ జరిపి లావాదేవీలపై నిషేధం విధించింది. పలువురు వినియోగదారులకు చెందిన షేర్లను అక్రమంగా సొంత అవసరాలకు వాడుకున్నట్లు సెబి విచారణలో వెలుగు చూసింది. ఎగవేతదారుగా ప్రకటించడంతో పాటు ఎన్.ఎస్.ఈ (నేషనల్ స్టాక్ ఎక్చేంజి) సభ్యత్వం నుంచి తొలగించింది కూడా.

You might also like

Leave A Reply

Your email address will not be published.