FbTelugu

జడ్పీ చైర్మన్ ను వదిలేసిన పోలీసులు

రామగుండం: గతవారం రోజులుగా ప్రజలకు కన్పించకుండా పోయిన పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ను పోలీసులు ఇంటికి పంపించారు. హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో మధును టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ పూర్తి కావడంతో పుట్ట మధూకర్ ను నిన్న అర్ధరాత్రి సమయంలో రామగుండం పోలీసులు ఇంటికి పంపారు. విచారణ కోసం ఎప్పుడు పిలిపించినా హాజరు కావాలని పోలీసులు సూచించారు.వామన్ రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకే మధుకర్ ను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు సన్నిహితుడు కావడంతోనే అదుపులోకి తీసుకుని విచారించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయనతో పాటు భార్య పుట్ట శైలజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు పెద్దపల్లిలో టిఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అయితే తాము టిఆర్ఎస్ లోనే కొనసాగుతామని, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కావడంతోనే గతంలో ఈటల రాజేందర్ ను అభివృద్ధి పనులకోసం కలిసేవారని శైలజ స్పష్టం చేశారు. కెసిఆర్ తమ నాయకుడు అని, మరో నాయకుడు లేరని ఆమె మీడియాతో వెల్లడించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.