FbTelugu

రేవంత్ ను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులకు భోజనం వడ్డించే కార్యక్రమానికి వెళ్తున్న ఎంపి ఎ.రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు నిలువరించారు.

నియోజకవర్గం ఎంపిని అయిన తననే ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేను స్థానిక ఎంపి నీ, నన్ను ఆపాలని చెప్పింది ఎవడు అంటూ మండిపడ్డారు. మీకు ఆదేశాలు ఎవడు ఇచ్చాడో చెప్పాలంటూ అడిగాడు. భోజనం వడ్డించే కార్యక్రమానికి వెళ్తున్న తనను అడ్డుకోవడం సరికాదన్నారు. గాంధీ ఆసుపత్రి వద్ద నిత్యం ఒక వేయి మంది కి అన్నదానం కార్యక్రమాన్ని శనివారం రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండోరోజు గాంధీ తో పాటు సికంద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా చేపట్టాలని ఎంపి రేవంత్ రెడ్డి భావించారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న ఆయన వాహనాన్ని బేగంపేటలో నిలువరించి పోలీసులు చుట్టుముట్టారు. ముందుకు కదలనివ్వకపోవడంతో ఆయన పోలీసుల వైఖరిపై భగ్గుమన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.