FbTelugu

మందుబాబుల భీభత్సం… పోలీసులకు గాయాలు

హైదరాబాద్: ప్రతిరోజు రాత్రిపూట డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండడంతో విసుగుచెందిన కొందరు యువకులు పోలీసులనే తమ వాహనంతో ఢీకొట్టారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేట్‌లో మందుబాబులు హల్‌చల్ చేశారు. డ్రంకన్ డ్రైవ్ లో భాగంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారని గమనించిన మందుప్రియులు పోలీసులపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఎలా జరిగిందని ఒక ఏఎస్సై మహిపాల్ రెడ్డి పరిశీలిస్తున్న సమయంలో మరో కారు ఢీకొట్టింది. ఆయనకు కూడా  తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ అస్లాం ను పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.