FbTelugu

కిషన్ ప్రచారంలో పోలీసులే ఫుల్

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి రోడ్డు షోలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల కన్నా పోలీసులే ఉన్నారు. ఆయన రోడ్డు షో కోసం ప్రయాణిస్తున్న జీపులో ఆయన, పార్టీ అభ్యర్థులు, కొందరు కార్యకర్తలు తప్ప ఎవరూ లేరు.

నాంపల్లి నియోజకవర్గంలోని సీతారాంబాగ్ ఫ్రెండ్స్ ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన రోడ్డు షో గంట ఆలస్యంగా ప్రారంభమైంది. సుమారు 10 మందితో మల్లెపల్లి బీజేపీ అభ్యర్థి కొల్లురు ఉష తరఫున ప్రచారం ప్రారంభించారు. రోడ్డు షో లో 40 ద్విచక్ర వాహనాలపై కార్యకర్తలు ఉండగా, రెండు వందల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఫ్రెండ్స్ కేఫ్, బైటక్ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి మాట్లాడాల్సి ఉండగా, ఎవరూ లేకపోవడంతో ముందుకు వెళ్లిపోయారు. ఆ తరువాత ఆసిఫ్ నగర్, గుడి మల్కాపూర్ ప్రాంతాలకు వెళ్లిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.