FbTelugu

బండి సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

స్పష్టం చేసిన హైకోర్టు
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాలు సీజ్ చేయడంపై హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా పట్టుబడిన వాహనాలను సీజ్ చేయాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.

తన వాహనాన్ని సీజ్ చేశారంటూ పంజగుట్టకు చెందిన వెంకటేష్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాహనం సీజ్ చేయడమే కాకుండా నెలలు దాటుతున్నా ఇవ్వడం లేదంటూ పిటీషనర్ తరఫు న్యాయవాది విన్నవించారు. ఎలాంటి అధికారం లేనప్పటికీ వాహనాలు సీజ్ చేస్తున్నారని హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ఏ అధికారంతో వాహనం సీజ్ చేశారని ప్రశ్నించింది. ఇలా చేయాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. వాహనదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.