FbTelugu

పోలీసుల చేతులు నరికివేత… కాల్పుల్లో ఇద్దరు మృతి

చండీగఢ్: హత్య చేసిన నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పంజాబ్ పోలీసుల చేతులను నిహంగ్ సిక్కులు నరికేశారు. తమపైనే దాడికి దిగి చేతులు నరకడంతో స్వీయ రక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

తరన్ తరన్ జిల్లాలోని సుర్ సింగ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. కత్తులు, కృపాణాలు ధరించే వారిని నిహంగ సిక్కులు అని అంటారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఒకరిని హత్య చేసిన ఇద్దర్ నిహంగ్ సిక్కులు సుర్ సింగ్ గ్రామంలో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ఆ గ్రామానికి వెళ్లారు. పోలీసులను చూసిన నిందితులు ఎదురు దాడికి దిగి కత్తులతో చేతులు నరికారు. ఈ దాడిలో వాల్టోవా పోలీసు స్టేషన్ పోలీసులు నరేంద్ర సింగ్, బల్విందర్ సింగ్ చేతులు తెగాయి. తీవ్రంగా గాయపడిన మరో పోలీసు పరిస్థితి విషమంగా ఉంది. దాడికి తెగబడిని వారిని నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిహంగ్ సిక్కులు ప్రాణాలు కోల్పోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.