FbTelugu

ఆగి ఉన్న లారీని ఢీకొట్టి పోలీసు దంపతుల మృతి

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌ జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. రోడ్డు పక్కగా ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌, ఆయన భార్య ఝాన్సీ అక్కడికక్కడే మృతిచెందారు. ఇదే ప్రమాదంలో మరొకరికి గాయాలు కాగా వారి కుమారుడు (8) సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో ఝాన్సీ కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు సూర్యాపేట నుంచి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.