FbTelugu

స్టైలీ స్టార్ అల్లూ అర్జున్ పై పోలీసు కేసు!

హైదరాబాద్: టాలీవుడ్ ప్రఖ్యాత సినీ హీరో అల్లూ అర్జున్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.

వివరాల్లోకెళితే.. ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్, సినీ బృందం కుంటాల జలపాతాన్ని సందర్శించి, షూటింగ్ తీశారని.. అయితే ప్రాథమిక అనుమతులు తీసుకోకుండా, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు నిన్న ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాతే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

You might also like