FbTelugu

మాస్క్ లేదని మహిళను చితక్కొట్టారు

భోపాల్: మాస్క్ ధరించకపోతే అపరాధ రుసుం వేయాలి లేదంటే గట్టిగా వార్నింగ్ చెప్పి మరోసారి జరగకుండా చూడాలని చెప్పి పంపాలి. మహిళల విషయంలో అయితే ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

అయితే మధ్యప్రదేశ్ పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా ఒక మహిళ విషయంలో ప్రవర్తించి వార్తలకెక్కారు. మాస్క్ ధరించలేదని సదరు మహిళను బూటు కాళ్లతో తన్నుతూ, పిడి గుద్దులు గుద్దుతూ, జుట్టు పట్టుకుని లాగి మరీ చితక్కొట్టారు. వారి బారి నుంచి బయటపడేందుకు మహిళ తన శక్తిని కూడదీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయ్యింది. మహిళా పోలీసు ఆమెను పోలీసు వ్యాన్ లోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా బాధితురాలి కుమార్తె వెనక్కి లాగింది. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరించారు. ఎంతకూ పోలీసు వ్యాన్ ఎక్కకపోవడంతో మహిళా పోలీసు ఆమె చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో రోడ్డు మీద వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురయ్యారు. కరుడు గట్టిన నేరస్తులను కూడా ఇంత దారుణంగా కొట్టరన్నారు. మాస్క్ ధరించనందుకు మధ్య వయస్సు మహిళను కొట్టడంపై మండిపడుతున్నారు. మీరు మనుషులా, రాక్షసులా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.