తిరుపతి: దీక్ష చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడును విమానాశ్రయం నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ ని కలిసేందుకు వెళ్తున్న చంద్రబాబును విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఇక చేసేది లేక చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం లాంజ్ లో మధ్యాహ్నం నుంచి నేలపై కూర్చుని దీక్ష చేస్తున్నారు.
అనుమతించే వరకు కదిలేది లేదని ఆయన పోలీసులకు స్పష్టం చేశారు. పోలీసులు ఎంతగా నచ్చ చెప్పినా ఆయన అక్కడి నుంచి కదలేదు. కనీసం మధ్యాహ్నం భోజనం కూడా తీసుకోలేదు. సాయంత్రం కావడంతో అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్పైస్ జెట్, ఇండిగో, ట్రూ జెట్ విమానాల్లో చంద్రబాబు నాయుడుతో పాటు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి టిక్కెట్లు కూడా బుక్ చేశారు.