FbTelugu

టీఆర్ఎస్ కొమ్ముకాస్తున్న పోలీసులు: ఉత్తమ్

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలే పరిస్థితిలో ఉందని, పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు కొమ్ముకాస్తున్నారుని టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

హైకోర్టు న్యాయవాదుల వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి కేసు ని వేగవంతంగా విచారణ జరపాలని డీజీపీ ని కోరామన్నారు. మంథనిలో ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా మాఫియా రోజురోజుకి చెలరేగి పోతుందన్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసును లోకల్ పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ హత్య కేసును వేగవంతంగా విచారణ చేసి తగిన న్యాయం చేయాలని డీజీపీని కోరామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం 2023లో కుప్పకూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు. వామన్ రావు హత్య కేసులో రాష్ట్రప్రభుత్వం నిందితులని కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పోలీసులు తగిన చర్యలు తీసుకొని వారి కుటుంబాన్ని కాపాడాలని కోరుతున్నామని ఉత్తమ్ చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.