FbTelugu

కేసీఆర్ తొత్తులుగా పోలీసులు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ స్వయంగా మత విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్ శాతం తగ్గిందన్నారు.

ఇవాళ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంగం డమ్మీగా మారిందని అన్నారు. ఉపాధ్యాయులు లేకుండా ఏ ఎన్నికలు జరగలేదని, వారి ప్రమేయం లేకుండా సీఎం కేసీఆర్ ఎన్నికలు జరిపి అవమానపర్చిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలో కరోనా సాకుగా చూపి బ్యాలెట్ పేపర్ పెట్టడం తిరోగమన చర్య అన్నారు. మొన్నటి మొన్న బిహార్ ఎన్నికల్లో ఈవీఎంలను వాడారన్నారు. బ్యాలెట్ పెట్టి కరోనా తగ్గించే ప్రయత్నమా? పెంచే ప్రయత్నమా ప్రజలు ఆలోచించాలని కిషన్ రెడ్డి అన్నారు.
ఓటింగ్ శాతం తగ్గినందుకు టీఆర్ఎస్ సర్కార్ సిగ్గుతో తలదించుకోవాలని, ఎన్నికల సంఘాన్ని స్వార్థం కోసం ప్రభుత్వం ఉపయోగించుకుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మేము గెలువకున్నా పర్వాలేదు ఇంకో పార్టీ గెలువ వద్దు విధంగా టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యి ఎన్నికలు నిర్వహించాయని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మీద నమ్మకం లేకనే జిల్లాల నుంచి నాయకులను తీసుకువచ్చి డబ్బులు పంచారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లారీలు లారీలు మద్యం పంపిణీ జరిగిందన్నారు. స్వయంగా మంత్రుల పర్యవేక్షణ లో మద్యం వచ్చిందన్నారు. మంత్రులు స్వయంగా వచ్చి డబ్బులు పంచడం ఇంతకన్నా మరో అవమానం లేదన్నారు.
జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాల తుపాకుల చాటున జరిగిన ఎన్నికల్లో 54 శాతం పైగా పోలింగ్ అయింది, ఇక్కడ కాకపోవడం విడ్డూరంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. పోలింగ్ సరళి చూశాక మేము గెలుస్తామని మాకు విశ్వాసం వచ్చిందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.