శుభం యాదవ్ ను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్: నగంరలో ఇన్ స్టాగ్రామ్ నగ్న చిత్రాల కేసు వెలుగులోకి వచ్చింది. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఇందులో కీలక వ్యక్తి అయిన శుభం యాదవ్ ను అరెస్ట్ చేశారు.
శుభం యాదవ్ అనే యువకుడు అమ్మాయిల నగ్న చిత్రాలను కొన్ని రోజులుగా ఇన్ స్టాగ్రామ్ నకిలీ అక్కౌంట్ లో పోస్ట్ చేస్తున్నాడు. తాజాగా తన మిత్రుడి సోదరి ఫోటోలను నకిలీ అక్కౌంట్ లో శుభం యాదవ్ పోస్ట్ చేశాడు. మరిన్ని నగ్న ఫోటోలు కోసం అమ్మాయిని వేధిస్తున్నాడు. ఇవ్వకపోవడంతో ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు డిలీట్ చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశాడు.
వేధింపులు భరించలేక సదరు అమ్మాయి రాచకొండ పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. సైబర్ క్రైమ్ పోలీసులు శుభం యాదవ్ ను అరెస్టు చేశారు.