FbTelugu

ఆర్టిస్టు షణ్ముఖ్ పై పోలీసుల కన్నెర్ర

హైదరాబాద్: చట్టాలంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్న యూ ట్యూబ్ ఆర్టిస్టు షణ్ముఖ్ జస్వంత్ పై పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు. డ్రంకన్ డ్రైవ్ కౌన్సెలింగ్ కు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

జూబ్లిహిల్స్ లో అతి వేగంగా కారు నడిపి పలు వాహనాలను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన లో పలువురికి గాయాలు కాగా మూడు కార్లు, రెండు టూ వీలర్లు దెబ్బతెన్నాయి. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని షణ్ముఖ్ ను అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా 170 పాయింట్లు వచ్చాయి. పరిమితికి మించి మద్యం, డ్రగ్స్ తీసుకోవడంతో అతనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, కారు తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. కౌన్సెలింగ్ కు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వగా గైర్హాజరు కావడంతో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.