FbTelugu

డయాలసిస్ రోగులనూ కొడుతున్నారు: మమత

హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో పోలీసులు డయాలసిస్ రోగులనూ కొడుతున్నారని కిడ్నీ రోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఐ. మమత అన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బొగ్గులకుంట, అమీర్ పేట్ ప్రైమ్ ఆసుపత్రుల వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు. నగరంలో 18,000 కిడ్నీ రోగులు ఉన్నారని, ఒక్కరోజు డయాలసిస్ చేయించుకోలేని పక్షంలో వారి ప్రాణానికే ప్రమాదం ఉందన్నారు. దయచేసి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More