FbTelugu

2022 కు పోలవరం పూర్తి: పాండ్యా

తూ.గో.జిల్లా: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను 2022 నాటికి పూర్తి చేస్తామని డ్యామ్ డిజైన్ ప్యానల్ ఛైర్ పర్సన్ ఏబీ.పాండ్యా తెలిపారు. రాజమండ్రిలో పోలవరం డ్యామ్ డిజైన్ ప్యానల్ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన పాండ్యా మాట్లాడుతూ, ప్రాజెక్టులో 48 గేట్లకు గాను 29 గేట్ల అమరిక పూర్తయిందని అన్నారు.

ప్రపంచంలో అతి పెద్ద గేట్లను హైడ్రాలిక్ విధానంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 52 మీటర్ల స్పీల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని, స్పిల్ వే బ్రిడ్జీ 1128 మీటర్లకు గాను 1105 మీటర్లు పూర్తయిందన్నారు. గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు, పవర్ ప్యాక్ లు అమర్చే పనులు వేగంగా జరుగతున్నాయని పాండ్యా వివరించారు.
గిడ్డర్ల అమరిక పూర్తయిందని, ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్, నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్యామల రావు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.