FbTelugu

పోలవరం పరిహారం సొమ్ములు స్వాహ

కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసిన ఎంపి రఘురామ

అమరావతి: వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఫిర్యాదు చేశారు.

నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని మంత్రికి తెలిపారు. ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆధారాలు అందచేశారు. పరిహారం దారి మళ్లుతున్న అంశంపై వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని ఎంపి కోరారు. రివర్స్‌ టెండరింగ్‌ మూలంగా ప్రాజెక్టు వ్యయం తగ్గిందని మొన్నటి వరకు ప్రచారం చేసిన ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడేమో అదనపు నిధులు కేటాయిస్తున్నారన్నారు. ప్రాజెక్టుకు కేటాయింపులు పెంచి 25శాతం వరకు కమీషన్లు దండుకుంటున్నారని మంత్రి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. అటు నిర్వాసితులను మోసం చేస్తూ ఇటు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలుగ చేస్తున్నందున విచారణకు ఆదేశించాలని ఎంపి రఘురామ కృష్ణమరాజు కేంద్ర మంత్రి షెకావత్ ను కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.