FbTelugu

పోచంపాడులో తెప్పదీపం… ఆరుగురు మృతి

నిజామాబాద్: పోచంపాడు విఐపి ఘాట్ వద్ద గోదావరి లో ఈతకు వెళ్లిన ఆరుగురు  యువకులు గల్లంతు అయ్యారు. మృతులందరూ దగ్గరి బంధువులే కావడంతో విషాదం నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇవాళ ఉదయం నిజామాబాద్, మక్లూర్, డీకంపల్లి గ్రామాలకు చెందిన మూడు కుటుంబాలు విఐపి ఘాట్ కు వెళ్లాయి. ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్పదీపం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. తెప్పదీపం సమర్పించేందుకు వచ్చారు. స్నానాలు చేసేందుకు నదిలో దిగే క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు నదిలోకి జారిపడ్డారు. వారిని కాపాడేందుకు ఐదుగురు దిగారు. ఆరుగురు మృతి చెందగా, చిన్నారిని స్థానికులు కాపాడారు.

సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఆరు మృతదేహాలను వెలికితీశారు. నిజామాబాద్ ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్ (40), శ్రీనివాస్ కుమారులు సిద్ధార్థ్ (16), శ్రీకర్ (14), గుత్ప గ్రామానికి చెందిన రాజు (14), డీకంపల్లి వాసి సురేష్ (42), యోగేష్ (16) చనిపోయినట్లు గుర్తించారు. ఘటనా ప్రాంతం బంధువులు, స్నేహితుల రోదనలతో విషాదంగా మారింది.

కెసిఆర్ సంతాపం…

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ జారిపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. స్నానం చేయడానికని నదిలో దిగి దురదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందని సిఎం విచారం వక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.