FbTelugu

యోగికి గంటపాటు క్లాస్ పీకిన పిఎం?

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దాస్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడినట్లు తెలిసింది. యుపిలో గందరగోళ పరిస్థితులకు యోగి కారణమని పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో ప్రధానితో భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

పార్టీ పెద్దల ఆదేశం మేరకు హుటాహుటిన ఢిల్లీ చేరుకుని ముఖ్య నేతలను కలుస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో పార్టీని, ప్రభుత్వాన్ని చక్కబెట్టే పనిలో అధిష్టానం ఉంది. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ సుమారు గంటకు పైగా ప్రధాని తో ఉన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పార్టీ పరిస్థితి, ఒంటెద్దు పోకడలు, అసమ్మతి, కరోనా అదుపులో వైఫల్యం తదితర అంశాలపై ప్రధాని సీరియస్ అయినట్లు సమాచారం.

ముందు రోజు హోం మంత్రి అమిత్ షా తో సమావేశమై రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘంగా చర్చించారు. ఇవాళ పార్టీ అధ్యక్షుడు జెపి.నడ్డాతో సమావేశమై చర్చించనున్నారు. సిఎం మార్చడమా లేదా క్యాబినెట్ లో మార్పులు చేయడమా అనే దానిపై కసరత్తు జరుగుతోంది. యోగి పనితీరుపై కేంద్రం నుంచి వెళ్లిన దూతలు ముఖ్య నేతలు, కార్యకర్తల నుంచి వివరాలు సేకరించారు. పలు అంశాలపై వివరాలు సేకరించి నివేదిక తయారు చేసి ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జెపి.నడ్డాకు అందచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.