FbTelugu

నేడు ప్రధాని మోదీ ప్రసంగం

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా, లాక్ డౌన్ పై స్పష్టత ఇవ్వనున్నారు.
గల్వాన్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనాతో ఉద్రిక్తతలు, ఆదేశానికి చెందిన 59 మొబైల్‌ యాప్‌లను కేంద్రం నిషేధించిన నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి మోదీ ఇప్పటి వరకు అయిదు సార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మరో వైపు దేశంలో నేటితో అన్‌లాక్‌ 1.0 ముగియనుండగా.. రేపటి నుంచి అన్‌లాక్‌ 2.0 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. టిక్‌ టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. ఈ అవకాశాన్ని భారతీయ డిజిటల్‌ సంస్థలు అందిపుచ్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చే అవకాశముందంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.