FbTelugu

కాన్పూర్ ప్రమాదంపై పిఎం, సిఎం దిగ్భ్రాంతి

లక్నో: కాన్పూర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాన్పూర్ సమీపంలోని సచెండి వద్ద యుపి రోడ్ వేస్ కు చెందిన శతాబ్ది ఏసిబి బస్సు బలంగా ఆగి ఉన్న జెసిబిని డీకొట్టింది. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా నడుస్తున్నదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా పిఎం నిధుల నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు మంజూరు చేశారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సిఎం యోగి పరిహారం ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.