FbTelugu

తక్కువ ధరకే పట్టణాల్లో ప్లాట్లు: సిఎం జగన్

అమరావతి: పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్య లక్ష్యమని, ఇందుకోసం ప్రతి పట్టణంలో ఒక 100 నుంచి 150 ఎకరాలు సేకరించాలని సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇవాళ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఉపాధి హామీ పనులపై సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు విలేజీ క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి నిర్మాణాన్ని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులను సూచించారు. పట్టణాల్లో సేకరించిన భూమిలో ఎంఐజీ1 లో 150 చదరపు గజాలు, ఎంఐజీ2లో 200 గజాలు, ఎంఐజీ3లో 240 చదరపు గజాల ప్లాట్లు అభివృద్ధి చేయాలన్నారు. ఒక కుటుంబానికి ఒక ప్లాట్ కేటాయించాలన్నారు.

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, ఏప్రిల్ 1వ తేదీన నేను కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ను రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడుతున్నామని, పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాక దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.