FbTelugu

ప్రధాని మోదీ రాష్ట్రంలో కరోనా రోగుల దుస్థితి

వీడియో షేర్ చేసిన క్రికెటర్ హర్భజన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం అహ్మదాబాద్ లో కరోనా రోగుల దుస్థితి, బంధువుల పడుతున్న పాట్లను కళ్లకు కట్టే విధంగా క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్విటర్ లో వీడియో షేర్ చేశాడు.

హర్భజన్ షేర్ చేసిన వీడియో దేశంలో హృదయవిదారకతను వెలుగులోకి తెచ్చింది. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నది. హాస్పిటల్ లో మంచాలు దొరక్కపోవడంతో రోగులు అంబూలెన్స్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. హాస్పిటల్ ముందు పదుల కొద్దీ బారులు తీరిన 108 వాహనాలను చూపిస్తూ తీసిన వీడియోను తన అక్కౌంట్ లో హర్భజన్ షేర్ చేశాడు. బాధాకరమైన నిజం, దేవుడా దయచేసి అందరినీ కాపాడు అంటూ ఆవేదన తో ట్వీట్ చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.