FbTelugu

అనాథలకు పుష్కర భాగ్యము

* జిల్లా పోలీసుల సేవా స్ఫూర్తి
* పుష్కరాలకు 28 మంది అనాథలు

కర్నూలు : ‘నా’ అనేవారు ఎవరూ లేక, సమాజం నుంచి తీవ్ర వివక్షలను ఎదుర్కొంటూ జీవనం ఎల్లదీస్తున్న అనాథల పట్ల కర్నూలు పోలీసులు సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఇవాళ (ఆదివారం) 28 మంది అనాథ పిల్లలకు తుంగభద్ర నది పుష్కరాల పూజోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేలా కర్నూలు పోలీసులు సహాయపడ్డారు. గత 3 రోజులుగా అనాథలకు ఈ అవకాశం కల్పిస్తున్నారు.

గురువారం 30 మంది అంధులకు, శుక్రవారం 22 మంది వృధ్ధులకు, శనివారం 28 మంది అనాథ పిల్లలకు తుంగభద్ర నది పుష్కరాల పూజ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కల్పించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి సూచనల మేరకు కర్నూలు పట్టణ పోలీసులు తుంగభద్ర పుష్కరాలకు సంకల్ భాగ్ విఐపి పుష్కర ఘాట్ లో కర్నూలు నగరంలోని 16 మంది అనాథలను గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్స్ పెద్ద పాడు నుంచి, 12 మంది అనాథలను డాన్ బోస్కో నవజీవన్ అనాథ ఆశ్రమాల నుంచి మొత్తం 28 మంది అనాథ పిల్లలకు తుంగభద్ర నది పుష్కర పూజోత్సవ కార్యక్రమాలు పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్వెంకటాద్రి, కె.వి మహేష్, మహబూబ్ భాషా, వై. రవీంద్రా రెడ్డి, సిఐలు మహేశ్వర రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, డిసిపిఓ శారద మరియూ ఎస్సైలు

You might also like

Leave A Reply

Your email address will not be published.