FbTelugu

ప్లాస్మా దాతలే హీరోలు: దర్శకులు రాజమౌళి

హైదరాబాద్: ప్లాస్లా దాతలే నిజమైన హీరోలని, వారిని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నానని దర్శకులు ఎస్ఎస్.రాజమౌళి అన్నారు. తను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిన తరువాత ప్లాస్లా ఇస్తానని ఆయన ప్రకటించారు.

ఇవాళ జరిగిన ప్లాస్మా దాత అభినందన సభలో రాజమౌళి ప్రసంగిస్తూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తన పని కాకపోయినా సమాజ హితం కోసం సైబరాబాద్ సీపీ వీసీ.సజ్జనార్ చేస్తున్న కృషిని అభినందించారు. వాలంటీర్లు, ప్రముఖులను పిలిపించి ఒకే వేదికను సిద్ధం చేస్తున్నారన్నారు. ఇదేమంత సాదాసీదా విషయం కాదని, చాలా కష్టపడుతున్నారని కితాబునిచ్చారు.

ప్లాస్మా దాతలతో కలిసి తను కూడా వారియర్ అవుతానని, దాతల తల్లిదండ్రులు అనవసరంగా భయపడవద్దని రాజమౌళి కోరారు. ప్లాస్మా అనేది బ్రహ్మాస్త్రం, ప్రతి రోగిని బాగుచేయగలమన్నారు. సజ్జనార్ కు మద్దతిస్తే మరిన్ని ప్రాణాలు నిలబడతాయని ఆయన అన్నారు.

You might also like