FbTelugu

కోలుకున్న వారినుంచి ప్లాస్మా సేకరణ

హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయిన వారి నుంచి ప్లాస్మా ను గాంధీ వైద్యులు సేకరిస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించడానికి ఇప్పటికే కేంద్రం గాంధీ ఆస్పత్రికి అనుమతించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ప్లాస్మా ఇవ్వడానికి 32 మంది సిద్ధంగా ఉన్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ కు లేఖలు రాశారు. ఈ లేఖలో ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వారి వివరాలను తెలిపారు. కరోనా కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఈ ప్లాస్మా థెరపీ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో 332 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

You might also like