FbTelugu

శ్వాస సమస్య… విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

విజయవాడ: ఒక ప్రయాణీకురాలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడం గమనించిన విమాన సిబ్బంది అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు.
బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్ సిలిగురి వెళ్తున్న ఇండిగో విమానం బయలుదేరింది. బెంగళూరు నుంచి బాగ్ డోగ్రా వెళ్లాల్సిన ప్రయాణీకురాలికి శ్వాస సమస్యలు తలెత్తాయి.

ఆయాసంగా ఉందని, ఊపిరి ఆడటం లేదని ఆమె చెప్పడంతో ఇండిగో విమాన సిబ్బంది వెంటనే అత్యవరంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయ అంబూలెన్స్ లో ఆమెను వెంటనే చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఆ తరువాత అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.