FbTelugu

బెంగాల్ లో బిజెపిని కట్టడి చేసిన పికె

కొలకతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కట్టడి చేశారా అంటే… అవుననే విధంగా ఫలితాలు వస్తున్నాయి. ఆయన చెప్పినట్లుగానే బిజెపి 100 సీట్ల లోపే పరిమితం అయ్యింది.

తాజా సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్ లో 191 సీట్లలో టిఎంసి, 86 సీట్లలో బిజెపి ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్లను టిఎంసి దక్కించుకున్నట్లుగానే భావించాలి. వంద సీట్ల లోపే బిజెపిని పరిమితం చేస్తానని టిఎంసి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గతంలో చేసిన ట్వీట్ వైరలవుతోంది . టిఎంసి 200 కు పైగా స్థానాల్లో గెలుస్తుంది. బిజెపి ని 100 కంటే తక్కువ స్థానాలకే కట్టడి చేస్తాన్నారు. బిజెపి మూడంకెల స్థానాలను అందుకుంటే నేను రాజకీయ సర్వేల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా ‘ అని ఆయన బెంగాల్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ట్వీట్ చేశారు. ఉదయం నుంచి ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే ఆయన చెప్పిన ప్రకారమే ట్రెండ్స్ ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.