FbTelugu

పిస్టల్ మిస్ ఫైర్… హోమ్ గార్డ్ భార్య మృతి

విజయవాడ: సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సెక్యురిటి వింగ్ ఏఎస్పీ శశిభూషణ్ వద్ద అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ వినోద్ పిస్టల్ మిస్ ఫైర్ అయ్యంది. ఈ ఘటనలో హోమ్ గార్డు భార్య మృతి చెందింది.

పోలీసుల కథనం ప్రకారం ఏఎస్పీ శశిభూషణ్ మూడు రోజుల క్రితం క్యాంప్ కు అనంతపురం వెళ్లారు. ఏఎస్పీ పిస్టల్ హోమ్ గార్డ్ వినోద్ వద్ద ఉన్నది. నిన్న రాత్రి గొల్లపూడి మౌలా నగర్ లో భార్యకు సరదాగా పిస్టల్ చూపిస్తున్న సమయంలో మిస్ ఫైర్ అయ్యింది. గుండెల్లోకి బులెట్ దూసుకెళ్లడంలో అక్కడికక్కడే హోమ్ గార్డ్ భార్య సూర్యరత్న ప్రభ మృతి చెందింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఘటన చోటు చేసుకున్నది. భవానీ పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.