FbTelugu

రూ.35 కోట్ల ఎన్సీఈఆర్టీ పుస్తకాలు సీజ్

లక్నో: ప్రభుత్వ అనుమతి లేకుండా ముద్రించిన రూ.35 కోట్ల విలువైన ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. పుస్తకాలతో పాటు ఆరు ప్రింటింగ్ యంత్రాలను జప్తు చేసి కేసు నమోదు చేశారు.

మీరట్ జిల్లాలోని పార్తాపూర్ గోదాములో అక్రమంగా ముద్రించి నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అజయ్ సాహ్ని తెలిపారు. ప్రధాన నిందితుడు సచిన్ గుప్తా పరారీ కాగా కేసులో సంబంధం ఉన్న 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈ పాఠ్య పుస్తకాలను ఢిల్లీ, ఉత్తరాఖండ్ తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అనుమతి లేకుండా విక్రయిస్తున్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న గోదాములపై ప్రజలు సమాచారం ఇవ్వాలని అజయ్ సాహ్ని ప్రజలను కోరారు.

You might also like