FbTelugu

కేరళ సీఎం కుమార్తె వీణ పెళ్లి

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణ, డివైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు పీఏ ముహమ్మద్ రియాస్ ను వివాహం చేసుకున్నది.

లాక్ డౌన్ నిబంధనల ప్రకారం కేవలం 50 మంది సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. సీఎం అధికారిక నివాసం క్లిఫ్ హౌస్ లో ఇవాళ ఉదయం జరిగిన వివాహ వేడుకకు పినరయ్ దంపతులతో పాటు, రియాస్ తల్లిదండ్రులు హాజరయ్యారు. ఇద్దరికి ఇది రెండో వివాహం, కాగా ఇద్దరికి పిల్లలున్నారు. రియాస్ తండ్రి పీఎం అబ్దుల్ ఖాదర్ రిటైర్డు ఐపీఎస్ అధికారి.

You might also like

Leave A Reply

Your email address will not be published.