FbTelugu

విశాఖ మేయర్ అభ్యర్థి పీలా: చంద్రబాబు

విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్‌ టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఆ పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని.. తమ విజయాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలోని పలు ప్రాంతాలలో ఆయన రోడ్ షో నిర్వహించారు. పీలా శ్రీనివాస రావు గెలుపును ఎవరూ ఆపలేరని, జీవీఎంసీ కార్యాలయంపై టీడీపీ జెండా ఎగురుతుందన్నారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బ్రహ్మాండమైన గెలుపును అందించాలని ప్రజలను కోరారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని ఎంతో కృషి చేశానని, ఎన్నో కంపెనీలు తీసుకువచ్చి శోభ తెచ్చామని చంద్రబాబు తెలిపారు

నేడు ఒంగోలులో లోకేష్ బాబు…

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేడు ఒంగోలులో రోడ్ షో నిర్వహించనున్నారు. తోవగుంట, మంగమ్మ కాలేజీ జంక్షన్, చంద్రయ్య నగర్, రమణారావు హాస్పిటల్ రోడ్, దిబ్బల రోడ్, 60 అడుగుల రోడ్ జంక్షన్, నవ భారత్ ధియేటర్ రోడ్, గోరంట్ల ధియేటర్ జంక్షన్, గోపాల్ నగర్-కమ్మ పాలెం రోడ్డు, కమ్మ పాలెం-ఎన్టీఆర్ విగ్రహం ప్రాంతాల్లో లోకేశ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తా. రాత్రికి కొత్తపట్నం బస్టాండ్ జంక్షన్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.