FbTelugu

చంద్రబాబుపై హైకోర్టులో వ్యాజ్యం

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి హైకోర్టును విన్నవించారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి జారీ చేయడంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో ప్రయాణించారు. మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు.

కరోనా వ్యాప్తి జరిగేలా చంద్రబాబు వ్యవహరించాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. మార్గమధ్యంలో పలుచోట్ల టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జనసమీకరణ చేసి, భౌతిక దూరం పాటించలేదు. ఎక్కడా నేతలు, కార్యకర్తలు మాస్క్‌లు పెట్టుకోకుండా హడావుడి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.