FbTelugu

పేర్ని నాని కుటుంబీకులకు జగన్ పరామర్శ

అమరావతి: మాతృవియోగం పొందిన మంత్రి పేర్ని నాని కుటుంబీకులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

గత కొంతకాలంగా నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం జగన్ మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటికి వెళ్లి నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.