FbTelugu

వాట్సప్ లో ఫొటోలు… విలపించిన తల్లిదండ్రులు

హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఒక యువతి మరుసటి రోజు తల్లిదండ్రులకు వాట్సప్ లో ఫొటోలు పంపించింది. వాటిని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మాల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో గోపాల్ నగర్ లో తలారి రుతిక (19) తల్లిదండ్రులతో ఉంటున్నది. ఈ నెల 22వ తేదీ న రుతిక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తమకు తెలిసిన స్నేహితులు, బంధువుల ఇళ్లలో అమ్మాయి కోసం తల్లిదండ్రులు వెదికినా ఆచూకి లభ్యం కాలేదు. ఈలోపు తను పెళ్లి చేసుకున్నట్లు బంధువులు, తల్లిదండ్రులకు వాట్సప్ లో ఫోటోలు పెట్టింది. ఆ తరువాత తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. తన కుమార్తె తప్పి పోయిందని, వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.