FbTelugu

దారుణం.. ఫోన్ పేలి కొడుకు, షాక్ లో తండ్రి

చెన్నై: చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి కొడుకు మృతి చెందగా.. ఆ వార్త విని షాక్ అయి తండ్రి ప్రాణాలు వదిలిన దారుణ ఘటన తమిళనాడులోని అర్కేనగర్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఆర్కేనగర్ లో బాలాజీ అనే యువకుడు తన సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టగా అది ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు దాటికి బాలాజీ మృతి చెందాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.